KCR Brother Daughter Ramya Rao Went To DGP Office: ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యరావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి వచ్చారు. డీజీపీని కలవడానికి అనుమతించాలన్నారు. అక్కడ ఉన్న పోలీసులు అనుమతించకపోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమె అక్కడే బైఠాయించడంతో.. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తన కొడుకు ప్రివెంటీవ్ అరెస్టుపై డీజీపీని కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ఆందోళనకు దిగుతున్నానని చెప్పారు.
అనంతరం రమ్యరావును డీజీపీని కలవడానికి అనుమతించడంతో లోపలికి వెళ్లారు. గత గురువారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీసులం అంటూ కొందరు వ్యక్తులు మా ఇంటికి వచ్చారని.. నా కొడుకు ఇంట్లో లేడు అని చెప్పిన వినకుండా ఇల్లు మొత్తం వెతికారని ఆమె తెలిపారు. ఆఖరికి వాటర్ ట్యాంకులో సైతం నా కొడుకు ఉన్నాడో లేడో అని చూడారని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంటికి వచ్చిన పోలీసులు చాలా అసభ్యంగా మాట్లాడారన్నారు. వారు నిజంగానే పోలీసులేనా అన్న అనుమానం తనకు కలుగుతుందన్నారు. స్కామ్‌లు చేసే వారికి రక్షణ కల్పిస్తున్న పోలీసులు.. విద్యార్థులు, ప్రజలను రక్షించకుండా ఉంటున్నారని మండిపడ్డారు. అన్ని పోలీస్ స్టేషన్లకు తిరిగాను. ఎక్కడా నా కుమారుడు లేదు. అసలు ఏం చేశారని ప్రశ్నించారు.