KCR Birthday Celebrations Started In Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో విజేతలకు ఎమ్మెల్సీ కవిత బహుమతులు అందించారు. గెలుపునకు చరిత్ర మలుపునకు మరో పేరు కేసీఆర్ అని కవిత పేర్కొన్నారు. అనేక కష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి సాధించారన్నారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజును మరపురాని విధంగా ఉండాలని గత మూడేళ్లుగా రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని కవిత తెలిపారు.
KCR Birthday today : సిద్దిపేటలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్- 3ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రాంభించారు. ఈ కార్యక్రమానికి క్రికెటర్ అంబటి రాయుడు, నటుడు నాని పాల్గొన్నారు. అంధుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంధులతో ఆ పుస్తకాన్ని చదివించి ఆ విశేషాలు తెలుసుకున్నారు. కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, వివిధ హోదాల్లో పదవులు, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు పుస్తకంలో పొందుపరిచారు.