ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని నాంపల్లి లలిత కళా తోరణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలకు పెద్దఎత్తున కవల పిల్లలు హాజరవడం విశేషం.
'కవల పిల్లల నడుమ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు' - Save Society KCR Birthday Celebrations
హైదరాబాద్ నాంపల్లి లలితకళాతోరణంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు వినూత్నంగా చేపట్టారు. సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో కవలలందరూ కలసి 2 కె రన్ చేయడమే గాక... కేసీఆర్ అనే అక్షరాలు వచ్చేలా వారంతా ఒక్కచోట చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
KCR Birthday
వారంతా కలసి 2 కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ అనే అక్షరాలు వచ్చే విధంగా ఒక్కచోట చేరారు. అనంతరం కేక్ కత్తిరించారు. సీఎం పుట్టినరోజును పురస్కరించుకుని ట్విన్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చి సంబురాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఇదీ చూడండి :మల్లన్న స్వామికి బోనమెత్తిన మహిళలు