తెలంగాణ

telangana

ETV Bharat / state

KC Venugopal on Telangana Assembly Elections : 'భేదాభిప్రాయాలను పక్కన పెట్టేయండి.. కలిసి నడిస్తే ఈసారి మనదే విజయం' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్​ ఫోకస్

KC Venugopal on Telangana Assembly Elections : నాయకులు వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కష్టపడి పని చేస్తే.. తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశీలకులు నెలలో రెండు వారాలు కేటాయించిన పార్లమెంటు నియోజకవర్గాల్లోనే ఉండి.. నాయకుల మధ్య సమన్వయం చేయాలని స్పష్టం చేశారు. పెండింగ్​లో ఉన్న 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండల అధ్యక్షుల నియామకాలను 15లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

Telangana Congress Assembly Elections 2023 Plan
KC Venugopal on Telangana Assembly Elections

By

Published : Aug 6, 2023, 7:33 AM IST

Updated : Aug 6, 2023, 8:12 AM IST

KC Venugopal on Telangana Assembly Elections : 'భేదాభిప్రాయాలను పక్కన పెట్టేయండి.. కలిసి నడిస్తే ఈసారి మనదే విజయం'

Telangana Congress Assembly Elections 2023 Plan : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ రాష్ట్ర పర్యటనలో పార్టీ నేతలకు భవిష్యత్​ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. గాంధీ భవన్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అధ్యక్షతన పార్లమెంటు నియోజక వర్గాల పరిశీలకులతో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్​రావు ఠాక్రేతో పాటు ముఖ్య నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. నెలలో కనీసం 15 రోజుల పాటు పరిశీలకులు వారికి కేటాయించిన నియోజకవర్గంలోనే ఉండి.. నేతల మధ్య సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. టికెట్ల విషయంలో పరిశీలకులు ఎవరూ జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పారు.

Congress Latest News : కారు స్పీడ్​కు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు

Telangana Congress TS Assembly Elections 2023 Plan : రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో పాల్గొన్న నేతలు.. వేణుగోపాల్ ఎదుట తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయని ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిలతో పాటు పలువురు సీనియర్​ నాయకులు వేణుగోపాల్​ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల నేతృత్వంలో పని చేసేందుకు తమకు ఇబ్బంది లేదని కొందరు నేతలు తెలిపినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండడం సహజమని.. వాటిని మనస్సులో పెట్టుకుంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా.. ద్వితీయ శ్రేణి నాయకులకూ అన్యాయం జరుగుతుందని వేణుగోపాల్​ స్పష్టం చేశారు.

KC Venugopal Meet with Parliament Abservers : 'వ్యూహాత్మకంగా ముందుకెళ్తేనే అధికారం చేజిక్కుంచుకోగలం'

కేసీఆర్​ ఎత్తులకు పైఎత్తులు వేయాలి..: ఇదే సమయంలో నాయకులందరినీ కలుపుకుని వెళ్లాలని రేవంత్​ రెడ్డికి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్​లో ఉన్న 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండల కమిటీలను ఈ నెల 15లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కర్ణాటక తరహాలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ నాయకులను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎత్తులను చిత్తు చేసేట్లు నాయకులకు వ్యూహాలతో కూడిన కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీల ఎత్తులకు పైఎత్తులు వేసుకుని వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయగలగాలంటే నాయకులంతా కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని వేణుగోపాల్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే.. నాయకులు అంతా పదవులు అనుభవిస్తారని.. లేదంటే పార్టీతో పాటు నాయకులూ నష్టపోతారని హెచ్చరించిన కేసీ వేణుగోపాల్‌.. దీనిని దృష్టిలో పెట్టుకుని పని చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

PCC Campaign Committee Meeting : ఇందిరాభవన్​లో క్యాంపెయిన్​ కమిటీ సమావేశం.. ప్రచారవ్యూహాలపై చర్చ

నెల వ్యవధిలో 4 సభలు..: తెలంగాణలో కలిసి కట్టుగా పని చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని కేసీ వేణుగోపాల్​ చెప్పారని పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్15 వరకు నాలుగు సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. పీసీసీ నాయకత్వంలో జిల్లా నేతలతో మాట్లాడి.. తేదీలను ఖరారు చేస్తారని వెల్లడించారు.

Revanthreddy Fires on BRS Leaders : 'ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. ఏ దందాలో చూసినా బీఆర్​ఎస్​ నేతలే'

Congress leaders protest : 'వరద బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే'

Last Updated : Aug 6, 2023, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details