Congress focus on Telangana assembly elections 2023 : తెలంగాణలో శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో కొత్త రాజకీయ నాయకుల చేరికలు, అసమ్మతి నాయకుల బుజ్జగింపు ప్రక్రియలు మొదలుపెట్టిన హస్తం పార్టీ.. ఇప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఆ పార్టీ అగ్ర నాయకులు తెలంగాణపై ఫోకస్ చేశారు. ఈసారి ఎలాగైనా హస్తం జెండా ఎగుర వేయాలని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఆర్గనైసింగ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌రాష్ట్ర నాయకులతో సమావేశమయ్యారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులతో గాంధీ భవన్‌లో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో వ్యుహాత్మకంగా వెళ్తేనే రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తి స్థాయిలో నాయకులు పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని వేణుగోపాల్ సూచించారు. నాయకులను సమన్వయం చేసుకొని వెళ్లినప్పుడే.. క్షేత్ర స్థాయిలో పార్టీ మరింత బలపేతం అవుతుందని తెలిపారు.
Congress Latest News : కారు స్పీడ్‌కు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు
KC Venugopal meet with Parliament observers : కర్ణాటకలో అమలు చేసిన విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తోన్న వారితో సంబంధం లేకుండా.. ఎన్నికల అబ్జర్వర్లు నేతల మధ్య సమన్వయం చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్‌ను సింగిల్ ఎజెండాతో ఎదుర్కోవాలని నేతలకు సూచించారు.బీఆర్ఎస్వ్యతిరేకం, కాంగ్రెస్ అనుకూల అంశాలను ఏజెండా ఖరారు చేసుకునేందుకు పీఏసీలో చర్చించాలని తెలిపారు. పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే.. నేతలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
TS Congress Leaders Meet Governor : 'వరద బాధితులను ఆదుకోండి' గవర్నర్‌కు కాంగ్రెస్ బృందం విజ్ఞప్తి