Kavitha Vs Kishan Reddy : బంగారు కుటుంబం పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలో మాత్రం మహిళలకు ఆరు సీట్లను మాత్రమే కేటాయించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Telangana BJP Chief Kishan Reddy) విమర్శల వర్షం గుప్పించారు. తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)లో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తమ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడిపెట్టవద్దని కవిత ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ల(Women Reservation)పై బీజేపీ రెండుసార్లు మోసం చేసిందని గుర్తు చేశారు. సంఖ్యాబలం ఉన్న బీజేపీ.. మహిళా బిల్లును ఎందుకు పార్లమెంటులో ఆమోదించలేకపోయారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
Kavitha Vs Kishan Reddy Women Reservation Issue : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును బీజేపీ తీసుకురావాలని.. ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. చట్టం ఉన్నందునే స్థానిక సంస్థల్లో 14 లక్షల మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ల పంపిణీ కోసం మాట్లాడుతుంటే.. బీజేపీలో ఉన్న నిరాశ, గందరగోళం తమకు అర్థమవుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ దగ్గర ఉన్న ఏకైక వ్యూహం.. టికెట్లు రాని బీఆర్‌ఎస్ అభ్యర్థులను వేటాడడమేనని ఎద్దేవా చేశారు. 'దయచేసి మీ రాజకీయ అభద్రతాభావాలను మహిళల ప్రాతినిధ్యంతో ముడిపెట్టవద్దు' అని కవిత కోరారు. పార్లమెంటులో సీట్లు పెంచి అందులో 1/3వ వంతు మహిళా నేతలకే రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ ఫార్ములా ప్రతిపాదించారని గుర్తు చేశారు.
KTR Tweet on BRS Candidates List : టికెట్ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామన్న కేటీఆర్.. మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్
MLC Kavitha Tweet On Women Reservations : మహిళా ప్రాతినిథ్యం విషయంలో బీజేపీ అభిప్రాయాలను వినాలనుకుంటున్నానని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే టికెట్ల పంపిణీ విషయంలో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు మహిళలకు ఎంత వరకు ఇస్తాయో చూస్తానని అన్నారు. బీజేపీ ఎప్పుడూ పార్లమెంటులో భారీ మెజారిటీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది కానీ.. మహిళలకు మాత్రం సమాన స్థానం ఇవ్వడానికి ఏమీ చేయలేదని విమర్శించారు.
బీఆర్ఎస్లో మహిళా రిజర్వేషన్‌పై కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. : బంగారు కుటుంబ సభ్యులు లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ దిల్లీలోని జంతర్ మంతర్‌లో దొంగ దీక్షలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో మాత్రం 33 శాతం రిజర్వేషన్ అంటే.. 3+3= 6 సీట్లే మహిళలకు కేటాయించారని అన్నారు. ఇదేనా బంగారు కుటుంబానికి వచ్చే లెక్కలు.. ఇదేనా మహిళలకు బీఆర్‌ఎస్ చేయాలనుకునే న్యాయం అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి 29 సీట్లు గెలవాలని కేసీఆర్ చెప్పారని.. మతోన్మాద మజ్లిస్ అభ్యర్థులను గెలిపించేందుకు ఒవైసీ చెప్పిన అభ్యర్థులను బరిలోకి దించుతూ.. దోస్తుకు మద్దతు నిలుస్తున్నారని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
BRS First List MLA Candidates Celebrations : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో.. నియోజకవర్గాల్లో మిన్నంటిన సంబురాలు
Kishan Reddy Nirmal Tour : 'రైతుల భూములతో వ్యాపారం చేయడానికే నిర్మల్ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు'