Kavita met KCR at Pragati Bhavan: దిల్లీ నుంచి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈడీ విచారణ అనంతరం ఇవాళ మధ్యాహ్నం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్, కవితతో పాటు ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కణ్నుంచి వారు నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఉగాది సందర్భంగా ప్రగతిభవన్‌లో పూజల్లో వారు పాల్గొన్నట్లు సమాచారం.
అనంతరం దిల్లీ పరిణామాలు, ఈడీ విచారణ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత వివరించినట్లు తెలిసింది. ఈడీ అడిగిన ప్రశ్నలు, తన సమాధానాలతో పాటు నిన్నంతా జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణపైనా కూడా చర్చించినట్లు సమాచారం. ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించినట్లు తెలిసింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు జారీచేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు ఈ రిట్ పిటిషన్ వేసింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని ఈ పిటిషన్ వేసింది. దీనిపై ఎల్లుండి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు దర్యాప్తులో కీలకం కానున్నాయి.