Corruption Is Not New.. We Are Not Truthful: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవినీతి కొత్తేమీ కాదని.. మేమేమీ సత్యవంతులమని చెప్పడం లేదని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి కన్నా ఎక్కువగా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో బీద రవిచంద్ర రూ.400 కోట్ల వరకూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
'అవినీతి కొత్తకాదు.. మేమేమీ సత్యవంతులం కాదు' - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
Corruption Is Not New.. We Are Not Truthful: ఆంధ్రప్రదేశ్‌లోని కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవినీతి కొత్తకాదు.. మేం సత్యవంతులమని చెప్పట్లేదని... ఇప్పటికన్నా గత ప్రభుత్వంలోనే అవినీతి ఎక్కువ జరిగిందన్నారు. టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర రూ.400 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
తమ పాలనలో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలన్నీ పేదల ఇళ్ల అవసరాలకేనని పేర్కొన్నారు. అదే గతంలో బీద సహా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గ్రావెల్ దోపిడికి పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం కావలిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్కడక్కడా పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై అలాంటి ఆరోపణలకు తావులేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు పురపాలక అధికారులు మామూళ్లు డిమాండు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇవీ చదవండి: