కొవిడ్ రెండ్ దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కవాడి గూడ కార్పొరేటర్ రచన శ్రీ సూచించారు. మహమ్మారి కట్టడికి ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. దోమలగూడలోని గగన్ మహల్ ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు, సిబ్బందికి.. గ్లూకోస్, పళ్ల రసం, టెట్రా ప్యాక్‌లను అందజేశారు.
'ఆరోగ్య సిబ్బంది కృషి అభినందనీయం' - ఆశా వర్కర్లకు గుర్తింపు
ప్రజలంతా కొవిడ్‌ను అరికట్టే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కవాడి గూడ కార్పొరేటర్ రచన శ్రీ కోరారు. దోమలగూడలోని ఓ ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు.. గ్లూకోస్, పళ్ల రసం, టెట్రా ప్యాక్‌లను అందజేశారు. మహమ్మారి కట్టడికి ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు.

aasha workers
భాజపా పిలుపు మేరకు.. సేవాహి సంఘటనలో భాగంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు రచన శ్రీ వివరించారు. ప్రజలందరూ కరోనా నియమాలను తప్పక పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.