సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కత్తిమహేశ్ దర్శకుడు, నటుడు మాత్రమే కాదు, సినీ విశ్లేషకుడు కూడా. పలు టెలివిజన్ ఛానళ్లు, యూట్యూబ్ వేదికగా సినిమాలను విశ్లేషించేవారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.
కత్తి మహేశ్ మరణ వార్తతో షాక్ అయ్యా!
కత్తి మహేశ్ మరణ వార్త తనను షాక్‌కు, ఆవేదనకు గురిచేసిందని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. మహేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.