తెలంగాణ

telangana

ETV Bharat / state

కేజీబీవీ విద్యార్థినుల దైన్యం... టీవీ పాఠాలు, జూమ్​ తరగతులకు దూరం! - పేద విద్యార్థులు

హైకోర్టు ఆదేశాలతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం తెరవలేదు. దాదాపు దీనిలో చదువుకునే అమ్మాయిలందరూ పేద కుటుంబాలకు చెందిన వారు. ప్రత్యక్ష తరగతులు ఎలాగో లేవు. కనీసం ఆన్​లైన్​లో అయినా చదువుకునేందుకు చాలా మంది వద్ద కనీసం ఫోన్లు కూడా లేవు. అటు టీవీ పాఠాలు లేక.. జూమ్​ తరగతులు అందక కేజీబీవీ విద్యార్థినులు చదువుకు దూరం అవుతున్నారు.

kasturba-gandhi-girls-schools
కేజీబీవీ విద్యార్థినుల దైన్యం

By

Published : Sep 17, 2021, 7:28 AM IST

పేదింటి ఆడపిల్లల చదువులు ఆగమాగమవుతున్నాయి. కనీసం టీవీ పాఠాలకూ అవకాశం కరవైంది. ఇతర పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష తరగతులు మొదలై రెండు వారాలవుతున్నా.. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(Kasturba Gandhi Girls' Schools) తెరచుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంస్థల్లో చదువుకునే అమ్మాయిలందరూ అత్యంత పేద కుటుంబాలకు చెందిన వారే. వారిలో 12 శాతం మంది తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా వారిలో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలే.

ప్రత్యామ్నాయం ఉన్నా..

గురుకులాలు, వసతిగృహాలను ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించడంతో కేజీబీవీల (Kasturba Gandhi Girls' Schools)ను ప్రభుత్వం(Telangana Government) తెరవలేదు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో చదువుకోవచ్చని ఉత్తర్వులిచ్చిన విద్యాశాఖ టీవీల ద్వారా ప్రసారం చేసే డిజిటల్‌ పాఠాలను ఆగస్టు నెలాఖరుకు నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాల (Telangana High Court Orders) తర్వాతా వాటిని కొనసాగించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఊళ్లో ఉండే కేజీబీవీ (Kasturba Gandhi Girls' Schools) విద్యార్థులు అక్కడున్న బడులకు వెళ్లి తాత్కాలికంగా చదువుకోవాలని ఆదేశాలిస్తే కొంతవరకైనా విద్య అందేది.

ఇవీ గణాంకాలు..

  • రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య: 475
  • వాటిలో విద్యార్థినులు: 1,10,634
  • తరగతులు: ఆరు నుంచి 10 వరకు (172 చోట్ల ఇంటర్‌ వరకు)

ఫోన్లే లేవు.. జూమ్‌ పాఠాలట..

జూమ్‌ పాఠాలు కొనసాగుతున్నాయని. దాదాపు 50 శాతం మంది హాజరవుతున్నారని డీఈవోలు, కేజీబీవీ అధికారులు చెబుతున్నా అది 30-40 శాతానికి మించకపోవచ్చని తెలుస్తోంది. ఎక్కువ మందికి స్మార్ట్‌ ఫోన్‌ సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణం.

ఇదీ చూడండి:Centre on Covid: 'రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి'

ABOUT THE AUTHOR

...view details