తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది' - sss regional director ramakrishna

సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.

'యూత్ ఎక్స్చేంజ్​తో సంస్కృతి సంప్రదాయాలపై  పరస్పర అవగాహన'
'యూత్ ఎక్స్చేంజ్​తో సంస్కృతి సంప్రదాయాలపై పరస్పర అవగాహన'

By

Published : Feb 12, 2020, 6:05 AM IST

Updated : Feb 12, 2020, 7:24 AM IST

కశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమంతో ఉత్తర సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు మంచి అవకాశమని ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. కశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉత్తర భారత్​కు చెందిన 120 మంది యువకులు ఇందులో పాల్గొన్నారు. కశ్మీర్ యువత హైదరాబాద్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ సంస్కృతి కోసం...

తెలంగాణ సంస్కృతిని తెలుసుకోవడానికి ఇదో సదవకాశమని రామకృష్ణ పేర్కొన్నారు. ఇక్కడి పురాతన కట్టడాలు చూడటం సహా సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడం ప్రధానమన్నారు. ఆహార అలవాట్లు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమన్నారు.

ప్రతీ ఒక్కరి బాధ్యత !!

యువత కోపరేటివ్ సంఘాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం తరఫున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండటం నూతన ఒరవడికి శ్రీకారమన్నారు. కశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ ద్వారా నూతన విషయాలను తెలుసుకునే అవకాశం లభించిందన్నారు.

'యూత్ ఎక్స్చేంజ్​తో సంస్కృతి సంప్రదాయాలపై పరస్పర అవగాహన'

ఇవీ చూడండి : కలుషిత ఆహారం తిని బాలుడి మృతి... ఆస్పత్రిలో కుటుంబం

Last Updated : Feb 12, 2020, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details