కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథి పోలీస్ కస్టడీ ముగిసింది. రెండు రోజుల కస్టడీ ముగియటంతో సీసీఎస్ పోలీసులు పార్థసారథిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.
పార్థసారథిని రెండు రోజుల పాటు ప్రశ్నించిన సీసీఎస్ పోలీసులు.. బ్యాంకును మోసం చేసిన కేసులో పలు విషయాలు రాబట్టారు. పెట్టుబడిదారులకు చెందిన డీమాట్ ఖాతాలోని షేర్లను తనఖా పెట్టడంతో పాటు.. వారి ఖాతాలో ఉన్న నగదును కూడా ఇతర ఖాతాలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. డీమాట్ ఖాతాదారుల షేర్లను సొంత షేర్లుగా చూపించి బ్యాంకుల వద్ద రుణాలు ఏ విధంగా పొందారనే విషయాన్ని పార్థసారథిని అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కార్వీ సంస్థపై నమోదైన కేసులను పార్థసారథి వద్ద ప్రస్తావించారు.
సీసీఎస్‌లో పార్థసారథిపై నమోదైన మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ కోరారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకును మోసం చేసి రూ.347 కోట్ల రుణం పొందారు. ఈ రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో పీటీ వారెంట్ ఇవ్వాలని నాంపల్లి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 19న అరెస్ట్..
చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. బుధ, గురు రెండు రోజుల పాటు పార్థసారథిని సీసీఎస్‌లో ఉంచి ప్రశ్నించారు. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో పోలీసులు పార్థసారథిని ఈ నెల 19న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలియకుండా షేర్లు తనఖా..
బ్యాంకు నుంచి రూ.137కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రతినిధులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్‌లో డీమాట్ ఖాతా ఉన్న పెట్టుబడిదారులకు తెలియకుండా పార్థసారథి, ఇతర డైరెక్టర్లు కలిసి షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టారు. కోట్ల రూపాయల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేశారు. కేసులో మరింత పురోగతి సాధించడానికి కస్టడీ ఇవ్వాలన్న పోలీసుల వాదనను అంగీకరిస్తూ నాంపల్లి న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.
2009లోనే..