Kartikamahotsavam In Etv: కార్తికమాసం 29రోజులూ.. శివప్రీతికరమైన ప్రదోషకాలంలో సాయంత్రం 6.15 నుంచి 7.00 వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణలో "కార్తిక మహోత్సవం" నిర్వహిస్తోంది. 3వ తేదీ, గురువారం శ్రీమేథా దక్షిణామూర్తి అష్టోత్తర పారాయణం, కార్తిక పురాణంలోని 9వ అధ్యాయంలో యమలోకానికి ఎటువంటి వారు వెళతారనే అంశంపై చర్చించనున్నట్లు తెలిపింది. యమదూతలు, విష్ణుదూతల సంవాదం, భగవంతుడిని చేరుకోటానికి మానవాళికి లభించిన నవవిధ భక్తి మార్గాలు ఏవి? అనే ధర్మం-మర్మం గురించి ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కరశర్మచే ప్రవచనం నిర్వహిస్తోంది.
ఈటీవీలో కార్తికమహోత్సవం ఎప్పటినుంచంటే..? - etv latest updates
Kartikamahotsavam In Etv: కార్తికమాసం సందర్భంగా 29 రోజుల పాటు సాయంత్రం 6.15 నుంచి 7.00 వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణలో కార్తికమహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 3వ తేది నుంచి ప్రారంభమయ్యే శ్రీమేథా దక్షిణామూర్తి అష్టోత్తర పారాయణం, కార్యక్రమం ద్వారా అనేక ఆసక్తికర అంశాల గురించి చర్చించనున్నట్లు తెలిపింది.
Kartikamahotsavam in ETV