కార్తిక మాసం చివరి రోజు సందర్భంగా హైదరాబాద్ బన్సీలాల్‌పేట్ గాంధీ నగర్ కాలనీలోని నాగదేవత ఆలయంలో కార్తిక మాస వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం రాత్రి స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అన్నపూర్ణా సమేత నీలకంఠుడు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చాడు. మహిళా భక్తులంతా శివుడికి పాలు పుష్పాలతో అభిషేకాలు చేశారు. రాత్రి సమయంలో ఆలయంలో మహిళా భక్తులు కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
బన్సీలాల్ పేటలో ఘనంగా కార్తిక మాస చివరి రోజు పూజలు - కార్తిక దీపాలు
హైదరాబాద్ బన్సీలాల్ పేటలోని నాగదేవత ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం చివరి రోజు సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధనలు చేశారు.
బన్సీలాల్ పేటలో ఘనంగా కార్తిక మాస చివరి రోజు పూజలు