కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని సైదాబాద్, కర్మానఘాట్, మలక్‌పేట, సంతోష్‌నగర్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా సంతోష్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని కోనేరులో దీపాలు వదులుతున్నారు.
భాగ్యనగరంలో కార్తీక వైభవం - కార్తీక మాసం
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భాగ్యనగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోనేరులో దీపాలు వదులుతున్నారు.
భాగ్యనగరంలో కార్తీక వైభవం
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి, పుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపోత్సవం, సహస్ర దీపారాధన సేవ, సామూహిక లక్ష్మీ నారాయణ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.
- ఇదీ చూడండి : కార్తీక పూర్ణిమం... శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రం