యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయానికి కార్తిక శోభ వచ్చింది. సోమవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. సత్యనారాయణ స్వామివ్రతాలు నిర్వహించే భక్తుల కోసం పీటలు, ఇతర సామాగ్రి సిద్ధం చేశామని ఈవో తెలిపారు.
కార్తిక పౌర్ణమి వేడుకలకు యాదాద్రి సిద్ధం: ఈవో గీతారెడ్డి - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా సమాచారం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మనరసింహస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు, వ్రతాలు నిర్వహించేవారికి సామాగ్రిని అందుబాటులో ఉంచారు.
కార్తిక పౌర్ణమి వేడుకలకు యాదాద్రి సిద్ధం: ఈవో గీతారెడ్డి
సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి వ్రతాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది కరోనా వల్ల ప్రతి బ్యాచుకు వంద జంటలను మాత్రమే అనుమతిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. బాలాలయంలో విద్యుత్ దీపాల అలంకరణ, అరటికొమ్మలు, ఇతర ఏర్పాట్లను ఆలయ సిబ్బంది సిద్ధం చేశారు.