హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ బాపు ఘాట్‌లోని రామాలయంలో పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు పెద్దఎత్తున దీపారాధన చేశారు. బాపు ఘాట్ వద్ద ఉన్న ముచుకుందా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఘాట్ వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా పోలీసులతోపాటు గుడి కమిటీ సభ్యులు అన్ని ముందుస్తు చర్యలు తీసుకున్నారు.
కార్తీకశోభ... బాపుఘాట్‌లో భక్తుల కోలాహలం - latest news of muchukunda river
కార్తీకపౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరారు. మహిళా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలుగించారు.
ముచుకుందా నదిలో తీరాన కార్తిక పౌర్ణమి వేడుకలు