హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్ పూర్లోని శ్రీ భవాని శంకర్ దేవాలయంలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లోక కల్యాణార్థం ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భోలక్ పూర్లోని శ్రీ భవాని శంకర్ దేవాలయంలో అక్షయ స్ఫూర్తి సంస్థ నిర్మించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
భోలక్‌పూర్‌లో వైభవంగా కార్తీక దీపోత్సవం - హైదరాబాద్ జిల్లా లేటెస్ట్ న్యూస్
భోలక్‌పూర్ శ్రీ భవాని శంకర్ ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోక కల్యాణార్థం ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వివరించారు.
భోలక్‌పూర్‌లో వైభవంగా కార్తీక దీపోత్సవం
భక్తులు మాస్కులు ధరించి... కరోనా నియమాలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:భద్రాచలంలో శోభాయమానంగా కార్తీక కాంతులు