దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్ సోకిందా లేదా తెలుసుకునేందుకు దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. అందుకు ముఖ్య కారణం.. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ను గుర్తించే కిట్లు లేకపోవడమే. వ్యాధి నిర్ధారణ కోసం రక్త నమూనాలను పుణె పంపిస్తున్నారు మన వైద్యులు.
ఇకపై హైదరాబాద్‌లోనే కరోనా టెస్టింగ్
ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా వైరస్‌కి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ ఈ రోజు గాంధీ ఆస్పత్రికి రానున్నాయి. దేశ వ్యాప్తంగా గాంధీ సహా మొత్తం 12 ల్యాబ్‌లకు ఈ కిట్లని పంపనున్నారు.
ఇకపై హైదరాబాద్‌లోనే కరోనా టెస్టింగ్
కానీ ఇలా చేస్తేవ్యాధి గుర్తించడం ఆలస్యమవుతున్నందును కేంద్ర ప్రభుత్వమే... కరోనా వైరస్‌ను గుర్తించే కిట్లను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి అందజేసింది. ఈరోజు సాయంత్రం వరకు ఆ కిట్లు గాంధీ ఆస్పత్రిలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌కు చేరనున్నాయి. గాంధీతో పాటు దేశ వ్యాప్తంగా మరో 11ల్యాబ్‌లకు ఈ కిట్లను పంపింది.
ఇవీ చూడండి:టిన్నర్ పరిశ్రమలో ఆరని మంటలు... స్థానికుల్లో భయం భయం..