ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ వన్నూరు ఆటోమేటిక్ శానిటైజర్ యంత్రాని రూపొందించారు. శానిటైజర్ డబ్బాను తాకకుండానే.. దాని కింద చేయి పెడితేనే.. ద్రావణం మన చేతిలో పడుతుంది. కరోనా నియంత్రణకు తన వంతు కృషి చేయాలని ఈ పరికరాన్ని తయారు చేసినట్లు వన్నూరు తెలిపారు.
ఆటోమేటిక్ శానిటైజర్... తాకకుండానే చేతులు శుభ్రం - automatic sanitizer news
కరోనా నేపథ్యంలో శానిటైజర్ నిత్యావసర సరకుల్లో ఒకటిగా మారిపోయింది. దుకాణాల్లో, కంపెనీల్లో శానిటైజ్ చేసుకుని కానీ లోపలికి వెళ్లం. ఆ శానిటైజర్ బాటిల్ని ప్రతి ఒక్కరూ తాకుతారు. దాని ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ ఆటోమేటిక్ శానిటైజర్ పరికరాన్ని రూపొందించారు.
ఆటోమేటిక్ శానిటైజర్... తాకకుండానే చేతులు శుభ్రం
ఆటోమేటిక్ శానిటైజర్ యంత్రం తయారీకి ఏడు వందలు ఖర్చు అవుతుందని వన్నూరు తెలిపారు. ఎక్కువ మోతాదులో తయారు చేస్తే నాలుగు వందలలోపు సరిపోతాయన్నారు. కళాశాల ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు తయారీ విధానం నేర్పిస్తానని లెక్చరర్ అంటున్నారు.