తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిరోజూ పండగే... తెలంగాణ వచ్చాక' - KARNE PRABHAKAR ADMIRES CM KCR

ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాతే రాష్ట్రంలో పండుగ జరుగుతోందని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

karne prabhakar speeks about telanagana government
'ప్రతిరోజూ పండగే... తెలంగాణ వచ్చాక'

By

Published : Mar 13, 2020, 5:34 PM IST

పల్లె ప్లలెన పల్లేర్లు మొలిసే.. తెలంగాణలోన లాంటి పాటలు పోయి తెలంగాణ అభివృద్ధిపై ఎన్నో పాటలొచ్చాయని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత రోజూ పండుగ జరుగుతోందని కర్నె ప్రభాకర్‌ తెలిపారు. గతంలో పంచాయతీరాజ్‌ శాఖకు రూ.13 వేల కోట్ల నిధులు ఎప్పుడూ దాటలేదని తెలిపారు. కానీ తెరాస అధికారంలోకి వచ్చాక... ప్రస్తుతం 23 వేల కోట్లు కేటాయిస్తోందని స్పష్టం చేశారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవడానికి సీఎం కేసీఆర్​యే కారణమని కర్నె ప్రభాకర్ వివరించారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని నమ్ముకుని... పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలను పరిశుభ్రంగా మలిచిన ఘనత సీఎందని ప్రశంసించారు.

'ప్రతిరోజూ పండగే... తెలంగాణ వచ్చాక'

ఇవీ చూడండి:బైకుపై నుంచి పడ్డవారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details