భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని మాజీ ఎమ్మెల్సీ, తెరాస నేత కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. గోరెటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌కు కర్నె ప్రభాకర్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ కోసం ఏ పనైనా చేస్తా: కర్నె ప్రభాకర్ - నూతన ఎమ్మెల్సీలకు కర్నె ప్రభాకర్ శుభాకాంక్షలు
ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు ప్రజలు, ప్రభుత్వం కోసం పని చేశానని మాజీ ఎమ్మెల్సీ, తెరాస నేత కర్నె ప్రభాకర్ అన్నారు. భవిష్యత్తులో ఓ చిన్న అవకాశం వచ్చినా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. పార్టీ కోసం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ కోసం ఏ పనైనా చేస్తా: కర్నె ప్రభాకర్
ఆరేళ్ల పాటు శాసన మండలిలో చట్టాల రూపకల్పనలో భాగస్వామయ్యేందుకు కేసీఆర్, కేటీఆర్ అవకాశం కల్పించారని.. వారికి కర్నె ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు ప్రజలు, ప్రభుత్వం కోసం పని చేశానన్న కర్నె ప్రభాకర్.. భవిష్యత్తులో ఏ చిన్న అవకాశం వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి:పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?