Karnataka Farmers Protest in Telangana: రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చే తాయిలాలు, వాగ్ధానాలను చూసి ఓటు వేస్తే.. భవిష్యత్‌లో తీవ్ర కష్టాలు పడే ప్రమాదం ఉందని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం(Karnataka State Farmers Union) అధ్యక్షుడు చంద్రశేఖర్ హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. అందుకే తెలంగాణ రైతులను జాగృతం కావాలని.. ప్రభుత్వాల హామీల వల్ల తాము మోసపోయినట్లు తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు.
'కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దు - కర్ణాటకలో ఆ పార్టీ దివాళా దిశగా నడుస్తోంది'
Karnataka Farmers Fires on Congress Election Guarantees : ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం నుంచి దాదాపు 700 మంది రైతులు, రైతు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Congress Govt) ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలు, వాటి అమలు తీరును రైతులకు వివరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు రైతుల గురించి, రైతు సంక్షేమం కోసం ఎన్నో చేస్తామంటూ హామీలను కురిపిస్తారని.. అలాంటి హామీలను చూసి మేము మోసపోయామన్నారు. తెలంగాణ రైతాంగం, విద్యావంతులు, విజ్ఞానవంతులను మోసపోవద్దని కర్ణాటక రైతులు కోరారు.
'డబ్బులు తీసుకొని బదిలీలు'- సీఎం కుమారుడిపై విపక్షాలు ఫైర్- సిద్ధ స్ట్రాంగ్ కౌంటర్!