కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం హైదరాబాద్ వచ్చి చినజీయర్ స్వామిని కలిశారు. ఈ రోజు శంషాబాద్‌లోని చినజీయర్ స్వామిని ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమానికి వచ్చిన యడియూరప్ప... చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యడియూరప్ప రాత్రి ఆశ్రమంలోనే బస చేశారు. 15 రోజుల తర్వాత మరోసారి ఆశ్రమానికి వచ్చి ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపుతానని యడియూరప్ప తెలిపారు.
చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం - కర్ణాటక సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబ సభ్యులతో కలిసి చినజీయర్‌స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 15 రోజుల తర్వాత మరోసారి ఆశ్రమానికి వస్తానని స్వామీజీకి విన్నవించారు.
చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం