Karnataka CM Siddaramaiah on Telangana Elections 2023 : ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల క్రతువు ముగియటంతో.. కాంగ్రెస్(Telangana Congress) జాతీయ నాయకత్వాన్ని రాష్ట్రంలో మోహరించింది. ఆకట్టుకునే హామీలు, అధికార పార్టీని ఢీకొట్టే ఎత్తులతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ .. మిగిలిన రెండు రోజులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి సారించింది. హస్తం అగ్రనేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు, రాష్ట్ర నేతలు తీరిక లేకుండా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Siddaramaiah Comments on BRS and BJP :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah) ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో సమస్య ఉంటే రైతులు హైదరబాద్‌లో ఆందోళన చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక రైతుల పేరుపై తెలంగాణలో నిరసన చేసేవాళ్లు కర్ణాటక రైతులు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కి కర్ణాటక రమ్మని ఓపెన్ ఛాలెంజ్ చేశానని.. కానీ ఆయన రాలేదని చెప్పారు. ఈరోజు కూడా కేసీఆర్‌ని కర్ణాటక రమ్మని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కర్ణాటక వచ్చి అక్కడి ప్రభుత్వ పాలన చూడాలని సూచించారు.
Siddaramaiah on Telangana Congress Six Guarantees : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కర్ణాటక రావాల్సిందిగా కోరుతున్నామని సిద్ధరామయ్య తెలిపారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు అవుతాయని పేర్కొన్నారు. కర్ణాటకలో తాము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం లేదని.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమని ప్రజలు మోసపోవద్దని సూచించారు. గ్యారెంటీ స్కీమ్‌ల అమలు కోసం వారు ప్రమాణస్వీకారం చేసిన రోజే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్‌ను ఓడించి - పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కు పంపించాలి : డీకే శివకుమార్