దిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు దిల్లీ ఉన్నత విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్ హఖ్ ఉత్తర్వులు జారీ చేశారు.
KARANAM MALLESWARI: దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా కరణం మల్లీశ్వరి - Karnam Malleswari Latest News
ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరికి మంచి గౌరవం దక్కింది. దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు దిల్లీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
![KARANAM MALLESWARI: దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా కరణం మల్లీశ్వరి KARANAM MALLESWARI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12229183-90-12229183-1624380262107.jpg)
కరణం మల్లీశ్వరి, వీసీ
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన కరణం మల్లీశ్వరి ఓ చిన్న గ్రామం నుంచి.. ఒలింపిక్స్‌లో పతకం వరకూ చేరిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. 2000 సంవత్సరంలో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని భారత్‌కు కాంస్య పతకం సాధించారు. 1999 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో మల్లీశ్వరిని సత్కరించింది.
ఇదీ చదవండీ...Cm Kcr: ఊరంతా కలిస్తేనే అభివృద్ధి... అప్పుడే బంగారు వాసాలమర్రి సాధ్యం