తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా విపత్తు కాలంలో ఆ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి' - సీఎం కేసీఆర్​

ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుంటే కాంగ్రెస్ భాజపాలు సీఎం కేసీఆర్​ను విమర్శించడాన్ని కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఖండించారు.

'కరోనా విపత్తు కాలంలో ఆ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి'
'కరోనా విపత్తు కాలంలో ఆ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి'

By

Published : May 10, 2020, 12:02 AM IST

తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమమే తెరాస ఎజెండా అని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. తాము ప్రజల కోసం, రైతుల సంక్షేమం కోసం పరితపిస్తూ ఉంటే కాంగ్రెస్ భాజపాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా ఈసారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందన్నారు.

ఓవైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే మరోవైపు ఈ పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్ ​రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవాకులు చవాకులు మాట్లాడొద్దన్నారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​లోనూ రోడ్లపైకి భారీగా వాహనాలు

ABOUT THE AUTHOR

...view details