హైదరాబాద్ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి టీఎన్జీవో కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి ఒక నెల పెన్షన్ రూ. 33,650 అందజేశారు. వారం రోజులుగా నగరంలో కురుస్తోన్న వానలకు జన జీవనం అతలాకుతలమైందనీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. టీఎన్జీవో రహదారులు, భవనాల శాఖ యూనిట్ ఆధ్వర్యంలో కారం రవీందర్ రెడ్డి, రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ లను హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు.
వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి సహాయక చర్యల కోసం సీఎం కేసీఆర్ రూ. 550 కోట్లు విడుదల చేయడం ద్వారా ఆ కుటుంబాలకు సహాయం అందిందని రాజేందర్ పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి సమాజంలోని పెద్దలు స్పందించి సహాయం అందించాలని కోరారు.