తెలంగాణ

telangana

ETV Bharat / state

కరాటే అభివృద్ధికి కృషి చేస్తా: తెలంగాణ స్పోర్ట్స్​ అథారిటీ ఛైర్మన్​ - రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌

రాష్ట్రంలో కరాటే మాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అసోసియేషన్​ లేకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులపై హైదరాబాద్​లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై... కరాటే అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. కరాటే మాస్టర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

karate masters meeting in hyderabad
కరాటే అభివృద్ధికి కృషి చేస్తా: తెలంగాణ స్పోర్ట్స్​ అథారిటీ ఛైర్మన్​

By

Published : Sep 5, 2020, 11:24 AM IST

రాష్ట్రంలో కరాటే అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలంగాణ స్పోర్ట్స్​‌ అథారిటి ఛైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ కరాటే అసోసియేషన్‌ గుర్తింపు కోసం కృషి చేస్తానని....కేంద్ర ప్రభుత్వం ఏ అసోసియేషన్‌కు గుర్తింపు ఇస్తుందో దానినే గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరాటే మాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అసోసియేషన్‌ లేకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులపై మాస్టర్లు నగరంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కరాటే మాస్టర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.

కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఇప్పటివరకు తెలంగాణలో ఏ కరాటే అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వలేదని ప్రముఖ కరాటే మాస్టర్‌ రవి తెలిపారు. జాతీయస్థాయి ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్నిక నిర్వహించి ఏ సంఘానికి గుర్తింపు ఇస్తుందో అదే సంఘానికి పూర్తి మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రచారాలను ఎవ్వరు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరాటే మాస్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇవీ చూడండి: గూడూరు దాతృత్వం... ప్లాస్మాదానం.. అడిగిన వారందరికీ సాయం?

ABOUT THE AUTHOR

...view details