ప్రజలు భూకబ్జాదారులను నమ్ముతూ.. ప్రభుత్వ భూములు కొని మోసపోతున్నారని హైదరాబాద్ కాప్రా తహసీల్దార్ గౌతమ్ పేర్కొన్నారు. ప్లాట్లు తక్కువ ధరకే లభిస్తున్నాయంటూ.. ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ప్రభుత్వ స్థలాల్లో అక్రమ లే-అవుట్లు చేసేవారిని ప్రజలు గుర్తించాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేసారు. అనుమానం వచ్చిన వ్యక్తులను నిలదీసి, ఆ సమాచారం తమకు తెలపాలని కోరారు. నిందితులపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని స్పష్టం చేసారు.