దేవాదాయ శాఖ నుంచి అమ్మఒడి పథకానికి నిధులు మళ్లింపుపై భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మళ్లించిన నిధులను మళ్లీ దేవాదాయ శాఖకు జమ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
దేవాదాయ నిధులను అమ్మఒడికి ఎలా మళ్లిస్తారు?: కన్నా - news on endowrsement department
దేవాదాయ శాఖ నుంచి అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను తిరిగి జమ చేయాలని సీఎం జగన్కు భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. దేవాదాయ శాఖ ఉండేది హిందూ ఆలయాల పరిరక్షణ కోసమేనన్నారు. అలాంటిది దేవాదాయ శాఖ నిధులు వేరే పథకాలకు ఎలా వాడతారని లేఖలో ప్రశ్నించారు.
సీఎంకు లేఖ: దేవాదాయ నిధులను అమ్మఒడికి ఎలా మళ్లిస్తారు?: కన్నా
దేవాదాయ శాఖ ఉండేది హిందూ ఆలయాల పరిరక్షణ కోసమేనన్నారు. అలాంటిది దేవాదాయ శాఖ నిధులు వేరే పథకాలకు ఎలా ఉపయోగిస్తారని లేఖలో ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. అమ్మఒడి పథకానికి మళ్లించి 24 కోట్లు 25 లక్షల 75వేల రూపాయలు తక్షణమే దేవాదాయశాఖకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్