తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా భార్య మృతిపై అనుమానాలున్నాయ్... లోతుగా విచారణ చేయండి'

మే 28న అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక ఘటనపై లోతుగా విచారించాలంటూ ఆమె భర్త సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సుహారిక తండ్రి మరణంతో కుటుంబంలో ఆస్తి తగాదాలు వచ్చాయని... దాని గురించే మాట్లాడేందుకు ఆమె వెళ్లిందని ఆరోపించారు.

kanna-lakshmi-narayana-second-son-about-his-wife-death-case
'నా భార్య మృతిపై అనుమానాలున్నాయ్... లోతుగా విచారణ చేయండి'

By

Published : Jul 26, 2020, 10:58 AM IST

తన భార్య సుహారిక మృతిపై అనుమానాలు ఉన్నాయని... ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ ఏపీ భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫనీంద్ర పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ని కలిసి వినతీపత్రం అందజేశారు.

మే 28న మాదాపూర్‌లోని బాంబో హిల్స్‌లో సుహారిక అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. పోలీసులు సుహారిక బర్త్​డే పార్టీకి వెళ్లిందని... అక్కడ కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తెసుకెళ్లేలోపు చనిపోయిందని చెబుతున్నారు. అయితే దీనిలో వాస్తవంలేదని... అసలు అక్కడ పార్టీ జరగలేదని ఫణీంద్ర తెలిపారు. దీనిలోని వాస్తవాలు బయటకు వచ్చేలా దర్యాప్తు చేయాలని కోరుతున్న ఫణీంద్రతో మా ప్రతినిధి మాఖాముఖి.

'నా భార్య మృతిపై అనుమానాలున్నాయ్... లోతుగా విచారణ చేయండి'

ఇవీ చూడండి:కరోనాకు దూరంగా... పల్లెల్లో భద్రంగా!

ABOUT THE AUTHOR

...view details