ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఉన్న దుర్గం బాప్టిస్ట్ చర్చి నిర్మాణం జరిగి 128 ఏళ్లు పూర్తి కావొస్తున్న ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఈ చర్చ్‌ను బ్రిటీష్ హయాంలో 1892లో రెవరెండ్ బ్రాక్ దొర నిర్మించారు. 1910 నుంచి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నట్టు ఆధారాలు చెబుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగి కట్టడాల్లో ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇదంతా ఒకెత్తైతే ఆ రోజుల్లోనే సాంకేతికతతో అమర్చిన పెద్ద గంట మరో ఎత్తు. రంగూన్ టేకుతో తయారుచేయించిన కిటికీలు, ధర్వాజాలు నేటికీ చెక్కు చెదరలేదు.
కోడి గుడ్డు సొన, గానుగ సున్నం ఈ చర్చి నిర్మాణానికి ఉపయోగించారని, అందువల్ల ఈ నిర్మాణం నేటికి చెక్కు చెదరకుండా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సువిశాల స్థలములో నిర్మించిన ఈ చర్చి బ్రిటీష్ వారి మేధస్సుకు నిదర్శనంగా నిలుస్తోంది.