తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై రయ్.. రయ్: అండర్ పాస్, పైవంతెన ప్రారంభం - కామినేని పైవంతెన ప్రారంభం

ఎల్బీనగర్​ రింగ్​రోడ్​ అండర్ పాస్, కామినేని కూడలి పైవంతెన ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ వీటిని ప్రారంభించారు. నాగోల్​ నుంచి ఎల్బీనగర్​కు వెళ్లేవారికి వెసులుబాటు కలిగించేలా దీనిని నిర్మించారు.

kamineni flyover and lb nagar underpass inauguration
ఎల్బీనగర్​ అండర్​పాస్, కామినేని పైవంతెన ప్రారంభం

By

Published : May 28, 2020, 12:46 PM IST

Updated : May 28, 2020, 1:05 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్​లోని కామినేని కూడలి వద్ద ఫ్లైఓవర్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. దీనిని 940 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 43 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ పైవంతెనతో నాగోల్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

ఎల్బీనగర్ జంక్షన్‌లో 519 మీటర్ల పొడవు, 12.25 మీటర్ల వెడల్పుతో 14కోట్ల వ్యయంతో అండర్ పాస్‌ను నిర్మించారు. దీని ద్వారా సాగర్ రింగ్‌ రోడ్‌ నుంచి నాగోల్‌ వెళ్లే వారికి ట్రాఫిక్‌ ఇక్కట్లు తీరుతాయి. అండర్​పాస్​తో ఓవైసీ జంక్షన్, శ్రీశైలం హైవేకు రాకపోకలు సులభతరం కానుంది. ఎస్​ఆర్​డీపీ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా మొత్తంగా 448 కోట్ల వ్యయంతో 10ఫ్లైఓవర్లు, 2 అండర్‌ పాస్‌లు నిర్మిస్తున్నారు.

ఇకపై రయ్.. రయ్: అండర్ పాస్, పైవంతెన ప్రారంభం

ఇవీ చూడండి:పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర..!

Last Updated : May 28, 2020, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details