తెలంగాణ

telangana

ETV Bharat / state

కమల్​హాసన్​ భారతీయుడు 2 షూటింగ్ ఎక్కడో తెలుసా.. - ప్రముఖ పర్యటక కేంద్రమైన గండికోటలో భారతీయుడు 2

Kamal Haasan Bharatiyadu 2: కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 చిత్రం షూటింగ్ జరుగుతుంది. అది ఎక్కడో కాదు ఏపీలో ప్రముఖ పర్యటక కేంద్రలో షూటింగ్ జరుగుతుంది. ఎక్కడో చూసేద్దాం.

Kamal Haasan Bharatiyadu 2
Kamal Haasan Bharatiyadu 2

By

Published : Jan 30, 2023, 2:00 PM IST

కమల్​హాసన్​ భారతీయుడు 2 షూటింగ్ ఎక్కడో తెలుసా..

Kamal Haasan Bharatiyadu 2: ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ జిల్లాలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన గండికోటలో భారతీయుడు 2 షూటింగ్ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్​పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవడంతో, అంతవరకు భారతీయుడు సినిమా షూటింగ్ గండికోటలో జరగనుంది.

గండికోట ముఖద్వారం వద్ద పాతకాలం నాటి దుకాణాల సెట్టింగులు వేశారు. అక్కడే ఇవాళ నిర్వహించారు. షూటింగ్​కు హీరో కమల్ హాసన్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత కమలహాసన్ ప్రజల ముందుకు వచ్చి అభివాదాలు చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details