తెలంగాణ

telangana

ETV Bharat / state

కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే - undefined

అంబర్​పేట నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ పథకాలు పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఎంతో తోడ్పాటునందిస్తున్నాయని కొనియాడారు.

కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

By

Published : Aug 14, 2019, 3:41 PM IST

అంబర్​పేట నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. 85 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఎంతోమంది పేదింటి ఆడబిడ్డలకు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ని విమర్శించడం వల్ల బీజేపీ నేతలు తమ నైతికతను కోల్పోతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భాజపా నేతలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలంటూ దుయ్యబట్టారు.

కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details