దళారీల ప్రమేయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు జరిపి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందించేలా చర్యలు తీసుకున్నామని ఉపసభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్మండి, బౌధనగర్ డివిజన్లకు సంబంధించి 251 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల 50 లక్షల మేర విలువజేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
లబ్ధిదారులకే నేరుగా సంక్షేమ పథకాలు: ఉపసభాపతి - కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నిరుపేద ప్రజలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు జరుపుతోందని ఉపసభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 251మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు: ఉపసభాపతి
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 10 లక్షల మేర విలువచేసే 26 చెక్కులను అందించారు. ఈకార్యక్రమంలో కుమారి సామల హేమ, అలకుంట సరస్వతి, విజయకుమారి, ధనంజన గౌడ్, తహసీల్దార్లు సునీల్ కుమార్, జానకి, యువనేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కాంగ్రెస్ నేతల అరెస్టు అనైతికం: ఉత్తమ్
TAGGED:
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ