తెలంగాణలోని నిరుపేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని నామాలగుండు క్యాంపు కార్యాలయంలో 95 మందికి రూ.84 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందించారు. పెళ్లీడుకు వచ్చిన బిడ్డల గురించి తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పద్మారావుగౌడ్ అన్నారు.
'సంక్షేమ పథకాల కోసం దళారులకు చిల్లిగవ్వ చెల్లించవద్దు' - Deputy Speaker Padmarao Goud Checks Distribution
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు... దళారులకు చిల్లిగవ్వ చెల్లించవద్దని ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని నామాలగుండు క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందించారు.
ప్రభుత్వ పథకాల అమల్లో దళారుల ప్రమేయం నివారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని... పేదలకు సీఎంఆర్ఎఫ్ నిధులను ఎక్కువగా తామే కేటాయించామన్నారు. 75 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, 20 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా డబ్బులడిగితే 040-27504448 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఉప సభాపతి సూచించారు. కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి, తహసీల్దార్ సునీల్‌కుమార్, ప్రజాప్రతినిధులు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.