పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు అమలుచేస్తోందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. కరోనా(corona) కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. గాంధీనగర్లోని ఘంటసాల గ్రౌండ్లో ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన 109మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఇంటింటి సర్వే నిర్వహించారని తెలిపారు. అందరూ విధిగా మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు.
kalyana lakshmi: పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు - తెలంగాణ వార్తలు
ముషీరాబాద్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ(kalyana lakshmi), సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ చేశారు. పేదల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని తెలిపారు. కరోనా(corona) కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ, ముఠా గోపాల్
ఈ కార్యక్రమంలో కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, ముషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ చందన, తెరాస సీనియర్ నాయకులు ముఠా జయసింహ, ముఠా నరేష్ , బింగి నవీన్, లక్ష్మీ గణపతి దేవస్థానం ఛైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ సోకిన తొలి రోగి మృతి