KCR Grandson Himanshu Rao speech : పదిమందికి సాయం చేయాలన్న ఆలోచన తన తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ నుంచే వచ్చిందని కల్వకుంట్ల హిమాన్షు రావు అన్నాడు. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని కేశవనగర్‌లో ఆధునీకరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించాడు. ఈ సందర్భంగా కేశవనగర్ పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన.. అనంతరం వారితో కలిసి భోజనం చేశాడు.
KTR Son Himanshu Speech :అనంతరం మాట్లాడిన హిమాన్షు.. ఓక్రిడ్జ్ పాఠశాల సీఏఎస్ విభాగం అధ్యక్షుడిగా ఎంపికైన సమయంలో కేశవనగర్ పాఠశాలకు వెళ్లిన తను.. అప్పటి ఈ పాఠశాల పరిస్థితి చూసి చలించిపోయానని చెప్పాడు. ఆడపిల్లలకు సరైన బాత్‌రూమ్‌లు లేవని.. స్కూల్ మెట్లు కూడా సరిగా లేవని గుర్తు చేసుకున్నాడు. మొదటి సారి పాఠశాల పరిస్థితులు చూసి కళ్లలో నీళ్లు వచ్చాయనని చెప్పాడు. అప్పుడే ఈ స్కూల్‌ను గొప్పగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానన్న హిమాన్షు.. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల అభివృద్ధి కోసం తన తోటి విద్యార్థులతో కలిసి రూ.90 లక్షల నిధులు సేకరించానని తెలిపాడు.
- Kalvakuntla Himanshu : మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న హిమాన్షు.. ఏం చేశాడంటే
- పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కల్వకుంట్ల హిమాన్షు
కేసీఆర్ మనవడిని కదా.. నార్మల్‌గా చేసే అలవాటు లేదు : ఆ డబ్బుతో కేశవనగర్ పాఠశాల రూపురేఖలు మార్చినట్లు హిమాన్షు చెప్పుకొచ్చాడు. ఆధునీకరించిన పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, మెరుగైన పరిసరాలు, భోజనం చేసే గది, బాత్రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపాడు. కేసీఆర్ మనవడిగా ఏదైనా గొప్పగా, మంచిగా చేయాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నాడు.