ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల వెబ్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారయ్యాయి. వెబ్ కౌన్సెలింగ్ తేదీలను కాళోజీ వర్సిటీ వెల్లడించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు గురువారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
నేడు, రేపు ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల వెబ్ కౌన్సెలింగ్ - Web Counseling for MSc Nursing, MPT Seats
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి కాను ఇవాళ, రేపు మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ వర్సిటీ ప్రకటించింది. పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
![నేడు, రేపు ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల వెబ్ కౌన్సెలింగ్ kaloji](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10505005-385-10505005-1612490657834.jpg)
నేడు, రేపు ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల వెబ్ కౌన్సెలింగ్
వర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫీకేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం సాయంత్రం 4 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదే విధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.