రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు... కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది.
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ - hyderabad latest news
రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు... కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొంది.
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ప్రవేశాలకు నోటిఫికేషన్
నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్(బీఎస్సీ నర్సింగ్). రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్(పీబీబీఎస్సీ నర్సింగ్). బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపి( బీపీటీ ). బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(బీఎస్సీ ఎంఎల్‌టీ) కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు.
ఇదీ చదవండి: జైపాల్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి