కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ హయతుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అనుమతులను సవాల్ చేసే గడువు 90 రోజులకు ముగిసిపోయిందని... తర్వాత పిటిషన్ వేశారని... దీన్ని కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. వ్యాజ్యం ఆలస్యమైన విషయాన్ని అంగీకరించినపిటిషనర్ తరఫు న్యాయవాది... నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఉన్నాయని వాదించారు. పిటిషన్‌ను విచారించేందుకు ఎన్జీటీ అంగీకరించింది. విచారణను ఆగస్టు 26కి వాయిదా వేసింది.
కాళేశ్వరానికి అనుమతులపై గ్రీన్ ట్రైబ్యునల్లో వ్యాజ్యం
కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలైంది. విచారించేందుకు అంగీకరించిన గ్రీన్ ట్రైబ్యునల్... విచారణను ఆగస్టు 26కి వాయిదా వేసింది.
కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులపై ఎన్‌జీటీలో వ్యాజ్యం