Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీకి.. స్వాతంత్ర్య సమర యోధుడు, సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు (Chennamaneni Rajeswara Rao) పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయన చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ.. రేపు రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా మల్కపేట జలాశయంతో పాటు ఆ పరిధిలోని కాల్వలకు ఈ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పరిథిలో సాగు, తాగునీరు అందిస్తున్న మధ్యమానేరు నుంచి ఎగువ మానేరు వరకు జలాశయం,కాల్వలకు చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెడుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
Kaleshwaram Project Water Level : కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ.. 35 గేట్లు ఎత్తి నీటి విడుదల
చెన్నమనేని రాజేశ్వరరావు సామాజిక సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా, తెలంగాణ మొదటితరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజల కోసం పోరాడిన గొప్పనేత అని అన్నారు. రైతాంగం కోసం ఆనాటి కాలంలోనే.. వరద కాల్వ, ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర ఆయనదని కొనియాడారు. పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చడానికి ఎత్తిపోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వరరావు ఎన్నో పోరాటాలు చేశారని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆనాటి చెన్నమనేని రాజేశ్వరరావు ఆకాంక్షలను ప్రతిఫలించేలా.. స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతాంగం నేడు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ప్రజాప్రతినిధిగా పనిచేసిన ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన.. తొమ్మిదో ప్యాకేజీ ద్వారా సాగునీరు అందుతోందని చెప్పారు. మధ్యమానేరు నుంచి ఎత్తిపోతల ద్వారా ఎగువ మానేరు వరకు నీటి సరఫరా జరుగుతోందని వివరించారు. రాజేశ్వరరావు నాటి కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ.. మల్కపేట జలాశయంతో పాటు ఆ పరిధిలోని ఎత్తిపోతల పథకం మొత్తంగా తొమ్మిదో ప్యాకేజీకి ఆయన పేరు పెట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు.
KaleshwaramProject : కాళేశ్వరంలో ఎత్తిపోతలు మళ్లీ షురూ
US Engineers praised Kaleshwaram Project :మరోవైపు రాష్ట్రం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు (Kaleswaram Project) అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్మించిన విషయం తెలిసిందే. అత్యంత తక్కువ సమయంలో ఎంతో నాణ్యతతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని.. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పేర్కొంది.
ప్రాజెక్టు విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని సొసైటీ ఛైర్మన్ మరియా సీ లెమాన్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైనదని సొసైటీ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్-ఎలెక్ట్ షిర్లీ క్లార్క్ పేర్కొన్నారు. తెలంగాణ వాసుల జీవన నాణ్యతను కాళేశ్వరం పెంచిందని షిర్లీ క్లార్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నీటిని 500 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం.. ఒక హైడ్రాలిక్ ఇంజనీర్‌గా తన మనసును ఆకట్టుకొందని వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం.. ప్రపంచ సవాలు అన్న సొసైటీ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్.. తెలంగాణ ఈ విషయంలో ఇతరులకు గొప్ప ఉదాహరణగా నిలిచిందని వెల్లడించారు.
MP Nama Nageswara Rao Speech In Lok Sabha : 'కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వలేదు.. నిరూపిస్తే రాజీనామాలకు సిద్ధం'
CM KCR Review on Water Storage in Reservoirs : కాళేశ్వరం విలువ.. కష్టకాలంలోనే తెలుస్తుంది: సీఎం కేసీఆర్