Kaleshwaram Project Issue :కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (Kaleshwaram project) మొదటి లింకులో ఉన్న మూడు బ్యారేజీల తుది బిల్లులు పెండింగ్‌లో పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగడంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సమస్యలున్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులు పేర్కొనడం, మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ఎవరు చేయాలన్న వివాదం నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. తుది బిల్లులు చెల్లించేందుకు సంబంధిత ఇంజినీర్లు సిఫార్సు చేయడంతోపాటు, అందుకు సబంధించిగుత్తేదారుకు ధ్రువీకరణ ఇస్తారు.
Kaleshwaram Final Bills Pending 2024 :మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పనిచేసిన ఎల్‌అండ్‌టీ సంస్థకు సుమారు రూ.400 కోట్ల వరకు తుది బిల్లు చెల్లించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నారం ఆనకట్టకు పనిచేసిన అప్కాన్స్ సంస్థకి రూ.161 కోట్ల తుది బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీ పనిచేసిన, నవయుగ సంస్థకి పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. 2022లో వరదలకి అన్నారం పంపుహౌస్ వరదలకు నీట మునిగాక, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు కాంక్రీట్‌వాల్ నిర్మాణం చేపట్టారు. సుమారు 90 శాతానికిపైగా పూర్తైన ఆ పనికి మేఘా ఇంజినీరింగ్‌కు చెల్లించాల్సిన రూ.74 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ
పెండింగ్ బిల్లులు భారీగా : పునరుద్ధరణ పనులపై అంతిమ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మూడు బ్యారేజీలకు సంబంధించిన, తుది బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. నీటిపారుదలశాఖలో గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణకి కలిపి రూ.10,000ల కోట్ల వరకు రోడ్లు-భవనాలు సహా అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లోనూ భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.