తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టి గణపతి కోసం కళాంజలి గట్టి సంకల్పం - Kalanjali Eco Friendly Ganesha at Hyderabad

ఈ వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకుందామని ప్రముఖ వస్త్ర నిలయం కళాంజలి సంస్థ పిలుపునిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్​ సైఫాబాద్​లోని కళాంజలి వేదికగా హస్తకళల విభాగం వివిధ రూపాల్లో మట్టి గణపతులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. సామాజిక బాధ్యతతో అతి తక్కువ ధరల్లో వినాయక విగ్రహాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మట్టి గణపతి కోసం కళాంజలి గట్టి సంకల్పం

By

Published : Aug 28, 2019, 12:58 PM IST

మగువల మనసునే కాదు కళాభిమానులను విశేషంగా అలరించే వస్త్ర ప్రపంచం కళాంజలి. తన వంతు సామాజిక బాధ్యతను చాటుకుంటోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ ఏడాది వినాయక చవితి కోసం వినియోగదారులకు మట్టి గణపతి ప్రతిమలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ సైఫాబాద్​లోని కళాంజలి భవనంలో వివిధ ఆకృతుల్లో బొజ్జ గణపయ్యలను ముస్తాబు చేసి చవితికి సిద్ధం చేసింది.

ధర తక్కువే!!

పర్యావరణ హితమైన పండుగను జరుపుకోవాలని పిలుపునిస్తూ... కళాంజలి హస్తకళల విభాగం ఈ ఏడాది 500లకు పైగా మట్టి గణపతులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. అతి తక్కువ ధరల్లో చూడచక్కటి రూపాల్లో వినాయకులను ఏర్పాటు చేయడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.

సెప్టెంబర్​ 2 వరకు:

సెప్టెంబర్ 2 వరకు కళాంజలిలో పర్యావరణ హిత గణపతుల ప్రదర్శన కొనసాగనుంది.

మట్టి గణపతి కోసం కళాంజలి గట్టి సంకల్పం

ఇవీ చూడండి : 'శిశు విహార్​ గృహాన్ని కాపాడండి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details