సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో.. ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో నకిలీ ఖాతా తెరిచారు.. సైబర్ నేరగాళ్లు. ఆ ఖాతా నుంచి.. ఎమ్మెల్యే పేరుతో ఇతరులకు సందేశాలు పంపించారు. రూ. 15 వేలు డిపాజిట్ చేయాలంటూ మెసేజ్లు పంపారు.
ఎమ్మెల్యే పేరుతో ఫేస్బుక్ నకిలీ ఖాతా.. - ఏపీ తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. ఏదో ఒక కారణం చెప్పి.. నగదు కావాలంటూ సందేశాలు పంపిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సైతం ఈ సమస్య ఎదురవుతోంది. ఎమ్మెల్యే పేరుతో నకిలీ అకౌంట్ తెరిచి మనీ డిమాండ్ చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.
ఎమ్మెల్యే పేరుతో ఫేస్బుక్ నకిలీ ఖాతా.. ఎస్పీకి ఫిర్యాదు
ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ద్వారంపూడి.. జిల్లా ఎస్పీ నయీం అద్నాం అస్మీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. పరిహారానికి రెండు దశాబ్దాలు!