తెలంగాణ

telangana

ETV Bharat / state

క్లిక్​మనిపించిన ఈనాడు ఫోటోగ్రాఫర్ - హైదరాబాద్‌

జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శనలో ఈనాడు గ్రూప్‌కు చెందిన ఉద్యోగి ఎంవీ రాధకృష్ణమూర్తిని ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు వరించింది. ఛాయచిత్రాలు అంటే కేవలం ఫోటోలు తీయడం మాత్రమే కాదని... సామాజిక బాధ్యతతో  నిర్వర్తించాలని తెలంగాణ ఫోటోగ్రాఫీ అకాడమీ కార్యదర్శి విశ్వేందర్‌రెడ్డి అన్నారు.

క్లిక్​మనిపించిన ఈనాడు ఫోటోగ్రాఫర్

By

Published : Aug 28, 2019, 6:45 AM IST

Updated : Aug 28, 2019, 8:23 AM IST

తెలంగాణ ఫోటోగ్రపీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శనలో ఈనాడు గ్రూప్‌కు చెందిన ఉద్యోగి ఎంవీ రాధాకృష్ణమూర్తిని ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు వరించింది. ఆయనకు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో అవార్డు అందజేశారు. వరంగల్‌ నేషనల్‌ ఫొటోగ్రఫీ కన్వెన్షన్‌-2019 పేరిట నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో రాధాకృష్ణ తీసిన కాకతీయ హెరిటేజ్‌ చిత్రం ఉత్తమ ఛాయచిత్రంగా ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి విశ్వేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ అంటే కేవలం ఫోటోలు తీయడం మాత్రమే కాదని... సామాజిక బాధ్యతతో ప్రపంచంలో జరుగుతున్న వాస్తవలను ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

క్లిక్​మనిపించిన ఈనాడు ఫోటోగ్రాఫర్
Last Updated : Aug 28, 2019, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details