అందమైన అమ్మాయి... ఆకట్టుకుంది ఈ వేళ
అందమైన మగువలు వయ్యారాల నడకలతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ, ఆధునిక దుస్తుల్లో మోడల్స్ మెరిసిపోయారు. హైదరాబాద్ నగరంలోని ఓ వస్త్రాల తయారీ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆకట్టుకుంది.
ఫ్యాషన్ షోలో ఆకట్టుకున్న మోడల్స్
ఆధునికతకు సంప్రదాయన్ని జోడించి రూపొందించిన దుస్తుల్లో మగువలు మెరిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారించుకొని ఓ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన నూతన వస్త్రాల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. సరికొత్త దుస్తుల్లో మోడళ్లు మెరిసిపోయారు.